బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (15:42 IST)

పెంపుడు కుక్కకు ప్రమాదం జరగకూడదని ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

సాధారణంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు వివిధ రకాల చర్యలు చేపడుతున్నారు. పలు రకాల ట్రాఫిక్ ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధన కూడా ఉంది. అయినప్పటికీ చాలా మంది మోటార్ సైక్లిస్టులు హెల్మెట్ ధరించరు. 
 
అయితే, తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన బైక్‌పై వెళ్తోన్న సమయంలో తాను హెల్మెట్ పెట్టుకోవడమేకాకుండా తన వెనుక కూర్చున్న కుక్కకు కూడా హెల్మెట్ పెట్టాడు. తాను పెంచుకుంటోన్న కుక్కకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని ఆ ద్విచక్ర వాహనదారుడు తీసుకున్న జాగ్రత్తలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇపుడు ఈ శునకం హెల్మెట్‌ ధరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసైనా హెల్మెట్ పెట్టుకోని వారు మారతారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.