బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 16 సెప్టెంబరు 2024 (20:23 IST)

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

Mini moon
చందమామ. ఈ పేరు చెబితే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. వెండి వెన్నెల వెలుగులతో ప్రతి ఒక్కరి హృదయాలకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తాడు. మన చందమామ సంగతి అటు వుంచితే ఇప్పుడు భూమి చుట్టూ తిరిగేందుకు మరో మినీ చంద్రుడు రాబోతున్నాడు. ఈ చంద్రుడు సెప్టెంబరు 29 నుంచి నవంబరు 25 వరకూ భూమి చుట్టూ పరిభ్రమించి అనంతరం దూరంగా వెళ్లిపోతాడు.
 
నాసా శాస్త్రవేత్తలు ఈ మినీ చంద్రుడిని గత ఆగస్టు 7న పీటీ5 అనే గ్రహశకలంగా గుర్తించారు. కేవలం 10 మీటర్ల వ్యాసంతో వుండే ఈ చిట్టి చంద్రుడిని మనం నేరుగా చూడలేమని సైంటిస్టులు అంటున్నారు. టెలిస్కోపుకి కూడా ఈ చంద్రుడు అందడు. కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే దీనిని చూడలగలుతారు.
 
ఈ చంద్రుడి ద్వారా భూమి గురుత్వాకర్షణ పరిధిలోకి వచ్చే వస్తువులపై ఎలా ప్రభావం చూపుతుందనే దానిపై పరిశోధకులకు మంచి అవకాశం అని చెబుతున్నారు. భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలాల తీవ్రత ఎలా వుంటుందన్నది కూడా ఈ మినీ చంద్రుడు ద్వారా తెలుసుకోవచ్చని అంటున్నారు.