శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (07:19 IST)

సీఎంగా ప్రమాణం చేశారు.. చిన్నమ్మ దర్శనం కోసం బెంగుళూరుకు...

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళని స్వామి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సచివాలయానికి రావాల్సిన ఆయన... నేరుగా ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్న కూవత్తూరు రిసార్టుకు వెళ్లారు. అక్కడ గు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె. పళని స్వామి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర సచివాలయానికి రావాల్సిన ఆయన... నేరుగా ఎమ్మెల్యేలు బందీలుగా ఉన్న కూవత్తూరు రిసార్టుకు వెళ్లారు. అక్కడ గురువారం రాత్రంతా బస చేసి.. శుక్రవారం ఉదయం బెంగుళూరుకు వెళ్లనున్నారు.
 
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు శిక్ష పడటంతో జైలులో చిన్నమ్మ ఆశీస్సులు తీసుకునేందుకు ఆయన బెంగుళూరుకు వెళుతున్నారు. ఇక్కడ శనివారం నాటి బలపరీక్షపై చిన్నమ్మతో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. 
 
కాగా, శశికళను పరామర్శించేందుకు జైలు వద్ద సందడి పెరుగుతోంది. తమిళనాడు వాసులు జైలుకు పోటెత్తుతున్నారు. అయితే, జైలు అధికారులు ఎలాంటి అనుమతులు మంజూరు చేయడం లేదు. దీంతో వారు దిగాలుగా చెన్నైకు చేరుకుంటున్నారు.