మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (09:02 IST)

ఫిబ్రవరిలో లోక్‌సభ షెడ్యూల్ - ఏప్రిల్ - మే నెలల్లో ఎన్నికలు

వచ్చే యేడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా సారథ్యంలో ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఇందుకోసం వచ్చే వారంలో సీఈసీ సునీల్ అరోరా సారథ్యంలోని ఎన్నికల సంఘం వచ్చేవారంలో సమావేశంకానుంది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాలతో పాటు.. కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. దీనిపై ఈసీ కసరత్తులు చేయాల్సివుంది. 
 
ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేందుకు అవసరమైన భద్రతా సిబ్బంది తరలింపు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చే పండగలు, ఇతర ముఖ్యమైన రోజులను పరిగణనలోకి తీసుకుని పలు తేదీలను ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ 2014 మార్చి 5వ తేదీన విడుదల కాగా, ఎన్నికలు 9 విడతలుగా ఏప్రిల్‌ 7 - మే 12వ తేదీల మధ్య నిర్వహించారు. 
 
అలాగే, ఈ దఫా కూడా ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదలను విడుతల చేసి ఏప్రిల్‌ 10వ నుంచి మే 10వ తేదీలోపు మొత్తం 9 దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం ఉంది.