శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 15 డిశెంబరు 2018 (15:57 IST)

16-12-2018 నుంచి 22-12-2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రాహువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో బుధ, గురులు, ధనస్సులో రవి, శని, మకరంలో కేతువు, కుంభంలో కుజుడు. మీన, మేష, వృషభ, మిధునంలో చంద్రుడు. 16న తేదీన ధనుర్ ప్రవేశం. 18న ముక్కోటి ఏకాదశి, 22న దత్త జయంతి. ముఖ్యమై పనులకు పూర్ణిమ, శనివారం శుభదాయకం. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆది, సోమ వారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. సంప్రదింపులు వాయిదాపడుతాయి. ఆలోచనులు నిలకడగా ఉండవు. అవకాశాలు చేజారిపోతాయి. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. దైవకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కళా, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.  
 
వృషభం: కృత్తిక 2, 3 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
బంధుమిత్రులతో విభేదిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్థతమై నమ్మకం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. రుణ ఒత్తిళ్లు, ఖర్చులు అధికం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పెద్దల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఫోన్ సందేశాలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మంగళ, బుధ వారాల్లో పరిచయం లేని వారితే జాగ్రత్త. ప్రలోభాలు, మొహమ్మాటాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నిరుత్సాహనం వీడి ఉద్యోగయత్నం సాగించండి. సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతులు అధికమవుతాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం. అయిన వారి కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. కుటుంబ విషయాలు వెల్లడించవద్దు. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. గురు, శుక్ర వారాల్లో మీ జోక్యం అనివార్యం. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్పురిస్తుంది. దైవ, సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. క్రీడా పోటీలు నిరుత్సాహపరుస్తాయి.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహారానుకూలత ఉంది. మనోధైర్యంతో ముందుకు సాగండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఒక సమచారం ఆలోచింపచేస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. లైసెస్సులు, పర్మిట్ల రెన్యువల్‌లో ఏకాగ్రత వహించండి. శనివారం నాడు ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు కొత్త అనుభూతినిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.    
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ఆది, సోమ వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మీ సలహా సన్నిహితులకు లాభిస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు తప్పకపోవచ్చు. ఆహ్వానాలు, పత్రాలు అందుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. శ్రీమతి లేక శ్రీవారి వైఖరిలో మార్పు సంభవం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. షేర్ల క్రయవిక్రయాలకు అనుకూలం.  
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. కొన్ని విషయాలు ఊహించనట్టే జరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనాలోచితంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు ధనం అందుతుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మంగళ, బుధ వారాల్లో బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపుల, అనుభవం గడిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. కళాకారులకు ప్రోత్సాహకరం.     
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు సరైన సమయం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగాలి. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఆది, గురు వారాల్లో పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరానికి డబ్బు సర్దుబాటవుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కొత్త పరిచయాలేర్పడుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మత్తులు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.    
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద తీరుతాయి. మీ సమర్థతను తక్కువ అంచనా వేసుకోవద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. మంగళ, శని వారాల్లో పనుల ప్రారంభంలో అవాంతారాలెదురవుతాయి. శకునాలు, విమర్శలు పట్టించుకోవద్దు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. నోటిసులు అందుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడాపోటీల్లో రాణిస్తారు.  
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో శుభవార్త వింటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గృహమార్పు వలన ఫలితం ఉంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గురు, శుక్ర వారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీలో నైరాశ్యం చోటు చేసుకుంటుంది. మొక్కుబడిగా పనులు పూర్తిచేస్తారు. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. వేడుకలు, శుభకార్యంలో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. వృత్తి ఉనాధి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి ఆదాయాభివృద్ధి.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
సర్వత్రా అనుకూలతులున్నాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. రోజువారి ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులు చేపడతారు. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుకాదు. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సౌమ్యంగా మెలగాలి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఈ వారం ఖర్చులు అంచనాలు మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమెుత్తం ధనసహాయం క్షేమం కాదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషాన్నిస్తుంది. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనకూలం. కాంట్రాక్టులు చేజిక్కించుకుంటరు. పందాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. మీ జీవిత భాగస్వామితో ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. అతిగా ఆలోచించవద్దు. కాత్త వ్యాపకాలు సృష్టించుకోండి. స్థలమార్పు వలన ఫలితం ఉంటుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దైవకార్యంలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
వీడియోలో మీ రాశి ఫలితాలను వినండి...