గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (20:18 IST)

ఈ వారం రాశిఫలితాలు (మార్చి 18వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు (Video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అంచనాలు ఫలిస్తాయి.

కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో శని, కుజులు, మకరంలో కేతువు, మీనంలో రవి, బుధ, శుక్రులు. మీన, మేష, వృషభ, మిథునంలలో చంద్రుడు. 22న బుధుని వక్రమారంభం, 18న తెలుగు సంవత్సరాది. 
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆది, సోమవారాల్లో అనవసర జోక్యం తగదు. ఫోన్ సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. పెట్టుబడులు, వ్యాపార విస్తరణలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుకు సాదర వీడ్కోలు పలుకుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కోర్టు వ్యాజ్యాలు విచారణకు రాగలవు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. ఆర్థికస్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. మంగళ, బుధవారాల్లో ఏ విషయంపై ఆసక్తి ఉండదు. రోజులు భారంగా గడుస్తాయి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వివాహ యత్నాలు ప్రారంభిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం వుండదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో జాగ్రత్త. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు  
వ్యవహారాల్లో హడావుడిగా ఉంటారు. స్థిమితంగా ఆలోచించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. సంతానం ఉన్నత చదువులపై దృష్టిసారిస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. మానసికంగా కుదుటపడతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. గురు, శుక్రవారాల్లో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు ఏమంత ఫలితాలనివ్వవు. సరుకు నిల్వల్లో జాగ్రత్త.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గృహం ప్రశాంతంగా ఉంటుంది. బంధుత్వాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. శనివారం నాడు పంతాలు, భేషజాలకు పోవద్దు. కార్యసాధనలో జయం, ధనలాభం పొందుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలసివస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు అధికారులకు చేరవవుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఏజెన్సీలు, టెండర్లు దక్కించుకుంటారు. భాగస్వామిక చర్చకు కొలిక్కి వస్తాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. అనుభవజ్ఞల సలహా పాటించండి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆది, సోమవారాల్లో మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఆర్థిక వ్యవహారాలతో తీరిక ఉండదు. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. యత్నాలు విరమించుకోవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తికావు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మంగళ, బుధవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దల సలహా తీసుకోండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాల నుంచి బయటపడతారు. చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఆశాజనకం. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.  
పొదుపు మూలక ధనం అందుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ శ్రమ వృధా కాదు. రాబడికి తగినట్టు ఖర్చులుంటాయి. పనులు మందకొడిగా సాగుతాయి. ఆది, గురువారాల్లో కావలసన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల విషయంలో శుభపరిణామాలున్నాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదోన్నతి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట  
అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆర్థికస్థితి ఆశాజనకం. రుణ బాధలు తొలగిపోతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సర్వత్రా అనుకూలతలుంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. మంగళ, శనివారాల్లో విలువైన వస్తువులు, వాహనం జాగ్రత్త. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. క్రీడాకారులకు ప్రోత్సాహకరం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
వివాహ యత్నాలు ముమ్మరం చేస్తారు. బంధుత్వాలతో సంబంధాలు బలపడతాయి. వేడుకల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. గురు శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహమార్పు అనివార్యం. నోటీసులు, కీలక పత్రాలు అందుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. దైవకార్యానికి సన్నాహాలు సాగిస్తారు.
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ సలహా ఎదుటివారికి లాభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల ఆదరణ నిరుత్సాహపరుస్తుంది. శనివారం నాడు కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. పెట్టుబడులు, నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు పదవీయోగం. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ప్రకటనల వల్ల అవగాహన ప్రధానం. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దైవకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. విద్యార్థుల్లో ప్రశాంతత నెలకొంటుంది. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దల ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఉద్యోగ ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు.