శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 6 జనవరి 2018 (21:34 IST)

మీ వార రాశి ఫలితాలు... 07-01-2018 నుంచి 13-01-2018 వరకు(వీడియో)

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, ధనుస్సులో రవి, బుధ, శుక్ర, శని, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 12న సర్వ ఏకాదశి, 13న శుక్రుడు మకర ప్రవేశం. మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, ధనుస్సులో రవి, బుధ, శుక్ర, శని, మకరంలో కేతువు. సింహ, కన్య, తుల, వృశ్చికంలలో చంద్రుడు. 12న సర్వ ఏకాదశి, 13న శుక్రుడు మకర ప్రవేశం.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సర్వత్రా అనుకూలతలుంటాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ మాటతీరును కొంతమంది తప్పుపడతారు. ఆది, గురువారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. క్రీడా, కళా పోటీల్లో రాణిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మంగళ, శనివారాల్లో పనులు ముగింపుకొచ్చేసరికి మందకొడిగా సాగుతాయి. మీ శ్రమ వృధా కాదు. కొంత మొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు కలిసివస్తుంది. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు.
 
మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3  పాదాలు
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆత్మీయులను వేడుకలను ఆహ్వానిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆచితూచి వ్యవహరించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పెద్ద ఖర్చు తగిలే  సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. గురు, శుక్రవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. సేవా, న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో జాగ్రత్త.
 
కర్కాటకరాశి: పునర్వసు 4వపాదం, పుష్యమి, ఆశ్లేష  
ఈ వారం సర్వత్రా అనుకూలతలుంటాయి. గృహంలో సందడి నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రావలసిన ధనం అందుతుంది. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. చిరు వ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమల వారికి ఆశాజనకం. క్రీడా పోటీలు, పందాలు ఉల్లాసాన్నిస్తాయి. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
శుభకార్య యత్నాలు ముమ్మరం చేస్తారు. సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక వ్యవహారం లాభిస్తుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. గృహమార్పు సత్ఫలితాలనిస్తుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఎదుటివారికి అనుకూలిస్తుంది. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. క్రీడా, కళా పోటీలు, పందాల్లో విజయం సాధిస్తారు. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆది, సోమవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సర్దుబాటు ధోరణితో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. లైసెన్సుల రెన్యువల్‌లో నిర్లక్ష్యం తగదు. పందాలు, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆత్మీయులకు సాయం అందిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం అత్యుత్సాహాన్ని కట్టడి చేయండి. ముఖ్యులను కలుసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. వేడుకలు, విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. గృహం సందడిగా ఉంటుంది. మంగళ, బుధవారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా నిలిపివేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలే శ్రేయస్కరం. ఏజెంట్లు, బ్రోకర్లకు ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఇంతకాలం పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోవాలి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. గురు, శుక్రవారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త. సలహాలు, సాయం ఆశించవద్దు. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ప్రేమానుబంధాలు, పరిచయాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం సందిగ్ధానికి గురిచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. క్రీడాపోటీలు, పందాల్లో విజయం సాధిస్తారు.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. ప్రముఖుల దర్శనం కోసం పడిగాపులు తప్పవు. ఆర్థికస్థితి సామాన్యం. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు అంచనాలు మించుతాయి. శనివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయుల సాయంతో కుదుటపడతారు. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సహోద్యోగులతో విందులు, సమావేశాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. జూదాలు, బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. ప్రయాణం అవస్థలు పడతారు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆది, సోమవారాల్లో ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం సంతృప్తికరం. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహమార్పు అనివార్యం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి ప్రయత్నించండి. ఎవరినీ నిందించవద్దు. పెద్దల సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, అధికారులకు స్థానచలనం. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లకు ఆదాయాభివృద్ధి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఖర్చులు అధికం, అవసరాలు నెరవేరుతాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం నిరీక్షణ తప్పవు. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మంగళ, బుధవారాల్లో ప్రముఖుల దర్శనం సాధ్యం కాదు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు చక్కని ఫలితాలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం కాదు. నూతన దంపతుల్లో అవగాహన నెలకొంటుంది.
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. నగలు, నగదు జాగ్రత్త. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. యత్నాలు ఫలిస్తాయి. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, గురువారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. గృహమార్పు సత్ఫలితాలనిస్తుంది. ఉద్యోగస్తులు బాధ్యతగా వ్యవహరించాలి. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.