గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (19:44 IST)

ఈ వారం రాశిఫలితాలు : డిసెంబరు 31 నుంచి జనవరి 6వరకు...

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, ధనుస్సులో రవి,శుక్ర, శని వృశ్చికంలో బుధుడు. 6న బుధుడు ధనుర్ ప్రవేశం. మిథునంలో కేతువు. వృషభ, మిథున, కర్కాటక, సింహంలలో చంద్రుడు.

కర్కాటకంలో రాహువు, తులలో గురు, కుజులు, ధనుస్సులో రవి,శుక్ర, శని వృశ్చికంలో బుధుడు. 6న బుధుడు ధనుర్ ప్రవేశం. మిథునంలో కేతువు. వృషభ, మిథున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. 
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన ప్రత్రాలు అందుతాయి. సంతానం ఉత్సాహాన్ని అదుపు చేయండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ శ్రమ వృధా కాదు. కష్టానికి ప్రతిఫలం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆత్మీయులకు కానుకలు అందిస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగ ప్రకటనల పట్స అవగాహన అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు. బహుమతులు, శుభాకాంక్షలు అందుకుంటారు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆత్మీయుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన వుండదు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. దైవదర్శనంలో అవస్థలు తప్పవు. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. పందాల్లో విజయం సాధిస్తారు.
 
మిథునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3  పాదాలు
పెట్టుబడుల విషయంలో  పునరాలోచన అవసరం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వాయిదా పడిన పనులు  పూర్తి చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆత్మయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆది, సోమవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వపాదం, పుష్యమి, ఆశ్లేష  
పరిచయాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. కానుకలు, శుభాకాంక్షలు అందుకుంటారు. దంపతుల మధ్య చికాకులు తలెత్తుతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సొంత నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. ఖర్చులు అదుపులో వుండవు. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. గృహంలో స్తబ్ధత నెలకొంటుంది. ఏ విషయంపై ఆసక్తి వుండదు. ఆత్మయులను, పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులకు అనుకూలం. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. జూదాల వల్ల చిక్కులు తప్పవు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. గురు, శుక్రవారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహమార్పు అనివార్యం. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనం. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రముఖుల కలయిక లాభిస్తుంది. ఆర్థిక అంచనాలు ఫలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కీలక పత్రాలు, నగదు జాగ్రత్త. పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కుటుంబీకులతో ఉత్సాహంగా గడుపుతారు. శనివారం నాడు సంతానం దూకుడును అదుపు చేయండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కళ, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ నొప్పించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు.అవసరాలు వాయిదా పడతాయి. ఆది, సోమవారాల్లో మీ శ్రీమతి తీరును గమనించి మెలగండి. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరులతో చర్చలు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. బోగస్ కంపెనీలు, దళారులను విశ్వసించవద్దు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. ఖర్చులు విపరీతం, ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. చక్కని ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుటారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు.
 
ధనుస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. సొంత నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. యత్నాలను విరమించుకోవద్దు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆది, గురువారాల్లో శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. అధికారులు, ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి. సాంకేతిక, వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పందాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. చాకచక్యంగా వ్యవహరించండి. తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. సొంత నిర్ణయాలు తగవు. పెద్దలను సంప్రదించండి. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మంగళ, శనివారాల్లో సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానం భవిష్యత్తు పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఆత్మీయులకు కానుకలిచ్చి పుచ్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పరిచయస్తుల ధన సహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహారానుకూలత, ప్రశాంతత పొందుతారు. ఆలోచనలు కొలిక్కి వస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. బంధుత్వాలు, ప్రేమానుబంధాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ఏజెంట్లు, రిప్రజెంటేటివ్‌లకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి ఆశాజనకం. వాహనం నడిపేటప్పుడు, ప్రయాణంలోను జాగ్రత్త. 
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అన్ని రంగాల వారికి ఆశాజనకం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పెద్దల వైఖరిలో మార్పు వస్తుంది. ఖర్చులు విపరీతం. అయిన వారి కోసం బాగా వ్యయం చేస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. ఆధ్యాత్మిక సంస్థలకు సాయం అందిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. శుభాకాంక్షలు, బహుమతులు అందుకుంటారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. సంతానం రాక సంతోష పరుస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.