కర్కాటకంలో రాహువు, కన్యలో కుజుడు, తులలో రవి, శుక్ర బృహస్పతి, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో శని, మకరంలో కేతువు. వృషభ, మిథున, కర్కాటక, సింహంలో చంద్రుడు. 7న సంకటహర చతుర్థి, 9న గురు మౌఢ్యమి త్యాగం. ముఖ్యమైన పనులకు సప్తమి, శుక్రవారం శుభదాయకం.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ వారం సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభకార్యాల్లో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు ఏకాగ్రత ప్రధానం. అధికారులతో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసాన్నిస్తాయి.
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాలు
ఆదాయం సంతృప్తికరం. విలాస వస్తువులు అమర్చుకుంటారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్దమొత్తం సాయం క్షేమం కాదు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. పదవుల కోసం చేసే యత్నాలు ఫలించకపోవచ్చు. ప్రత్యర్థుల వైఖరి ఆందోళన కలిగిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం, ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. వనసమారాధనలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది, సోమవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. గృహమార్పు నిదానంగా ఫలితాన్నిస్తుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కొంటారు. సంప్రదింపులు వాయిదా పడతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం పట్ల అలక్ష్యం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెట్టుబడులకు అనుకూలం. పారిశ్రామికవేత్తలకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. పొరపాట్లు దొర్లే ఆస్కారం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. మంగళ, బుధవారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆర్థిక అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వివాదాలు పరిష్కారమవుతాయి. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆందోళన కలిగించిన సమస్యలు సర్దుకుంటాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పదవుల స్వీకరణకు మార్గం సుగమమవుతుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. కుటుంబీకుల అభిప్రాయాలు తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. యోగ, ఆరోగ్యం విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు.
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఎదుటివారికి ఆంతర్యం గ్రహించండి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా ఆలోచించవద్దు. విశ్రాంతి అవసరం. శనివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. మీ పై శకునాల ప్రభావం అధికం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నిందించవద్దు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది వుండదు. ఆది, సోమవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. ఆహ్వానాలు ఆలోచింపజేస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు జాగ్రత్త. పరిచయంలేని వారితో మితంగా సంభాషించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ధనమూలక సమస్యలు ఎదుర్కొంటారు. ఆత్మీయుల సాయం అందుతుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచించండి. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆది, సోమవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. ఆహ్వానాలు ఆలోచింపచేస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు జాగ్రత్త. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం.
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
గృహంలో సందడి నెలకొంటుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపుచేయండి. ఆదాయం సంతృప్తికరం, అవసరాలు నెరవేరుతాయి. రుణ విముక్తులవుతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. సాధ్యం కాని హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. ఆది, గురువారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి ఏజెన్సీలు, టెండర్లు అనుకూలిస్తాయి.
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
గృహమార్పు కలిసివస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆదరణ ఆకట్టుకుంటుంది. హామీలు నెరవేర్చుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. శనివారం నాడు ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పెట్టుబడులు, వ్యాపార విస్తరణలో పునరాలోచన అవసరం. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సాంకేతిక, వైద్య, న్యాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పుణ్యక్షేత్ర సందర్శనలు సంతృప్తినిస్తాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. గురు, శుక్రవారాల్లో సందర్భానికి అనుగుణంగా వ్యవహరించాలి. ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు.
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. శుక్ర, శనివారాల్లో పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వనసమారాధనలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. సహోద్యోగులతో జాగ్రత్త. ఒత్తిడి, ధనప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భాగస్వామిక చర్చలు ఫలించవు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు.