గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : శనివారం, 27 జనవరి 2018 (19:31 IST)

ఈ వారం మీ రాశి ఫలితాలు (28-01-2018 నుంచి 03-02-2018 వరకు)

కర్కాటకలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో రవి, బుధలు, శుక్ర, కేతువులు. వృషభ, మిధున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. 3న సంకట హర చతుర్థి.

కర్కాటకలో రాహువు, తులలో బృహస్పతి, వృశ్చికంలో కుజుడు, ధనస్సులో రవి, బుధలు, శుక్ర, కేతువులు. వృషభ, మిధున, కర్కాటక, సింహంలలో చంద్రుడు. 3న సంకట హర చతుర్థి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సంప్రదింపులకు అనుకూలం. సొంత నిర్ణయాలు తగదు. పెద్దల సలహా తీసుకోండి. అపరిచితులను విశ్వసించవద్దు. గృహంలో సందడి నెలకొంటుంది. బంధుత్వాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. అవసరాలకు ఆదాయం సమకూరుతుంది. పనువు వేగవంతమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సౌమ్యంగా మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో ఊహించని మార్పులుంటాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం తగదు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. అపరిచితులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. సంతానం భవిష్యత్తు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఆశాజనకం. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. యత్నాలను విరమించుకోవద్దు. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆది, సోమవారాల్లో దుబారా ఖర్చులు అధికం. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పనులు సాగక విసుగు చెందుతారు. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. టెండర్లు, ఏజెన్సీలు దక్కకపోవచ్చు. విద్యార్థులకు కొత్త చికాకులు తలెత్తుతాయి. సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. మంగళ, బుధవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాల విస్తరణలు, ప్రాజెక్టులకు వనరులు సర్దుబాటవుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో పనులు సానుకూలమవుతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుచారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. గురు, శుక్రవారాల్లో ఏకపక్షంగా వ్యవహరించవద్దు. గృహమార్పు కలసివస్తుంది. పరిచయాలు పెంపొందుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగస్తులు పదవులు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు 
సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కీలకమైన విషయాలపై పట్టు సాధిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. శనివారం నాడు ఖర్చులు అధికం. సంతృప్తికరం. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. మీ ఏమరుపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు పట్ల శ్రద్ధ అవసరం. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి. న్యాయవాదులు, అకౌంట్స్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరం. ఆస్తి, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. కీలక సమావేశాలు, సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. మీ వైఖరిలో మార్పు వస్తుంది. సమయోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవతలి వారి వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. ఆత్మీయుల సాయం అందుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. కీలకలపత్రాలు అందుతాయి. ఆది, సోమవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు భారమనిపించవు. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. గృహమార్పు, శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మంగళ, బుధవారాల్లో బంధుమిత్రులతో మితంగా సంభాషించండి. కొంతమంది తప్పుగా భావిస్తారు. సంతానం భవిష్యత్తు పట్ల శ్రద్ధ అవసరం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే కొనసాగించండి. క్రీడా పోటీల్లో రాణిస్తారు.
 
ధనస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఆది, గురువారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. 
వృత్తుల వారికి సామాన్యం.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఖర్చులు విపరీతం. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. మంగళ, శనివారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు బాధ్యతలకు మార్పు, పనిభారం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
శుభకార్య యత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం వుంది. రుణ విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. గురు, శుక్రవారాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవులు, సభ్యత్వాల నుంచి తప్పుకుంటారు. ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగయోగం.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి 
గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. కొత్త పరిచయాలేర్పడతాయి. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. విలాస వస్తువులు, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. శనివారంనాడు ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులు పోటీల్లో విజయం సాధిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ద్విచిక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. ఆస్తి, స్థల వివాదాలు కొలిక్కి వస్తాయి.