శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (22:20 IST)

ఈ వారం రాశి ఫలితాలు (మార్చి 4వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు - Video)

పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి.

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగినా వెసులుబాటు వుంటుంది. ఆది, గురువారాల్లో పనుల్లో ఆటంకాలెదుర్కుంటారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం వుంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. జూదాలు, బెట్టింగ్‌లకు జోలికిపోవద్దు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. ధనం మితంగా వ్యయం చేయండి. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. అప్రమత్తంగా వుండాలి. మంగళ, శనివారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం వుంది. పెద్దల సలహా పాటించండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలసివస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వ్యవహారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంతోషకరమైన వార్తలు వింటారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. గురు, శుక్రవారాల్లో మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక ఒప్పందాలు కొలిక్కివస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. అనవసర విషయాల్లో జోక్యం తగదు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఆహ్వానం, నోటీసులు అందుకుంటారు. ఆర్థిక అంచనాలు తారుమారవుతాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. శనివారం నాడు చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వృత్తుల వారికి ఆశాజనకం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రయాణంలో జాగ్రత్త.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం నగదు సాయం తగదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థత వెలుగులోకి వస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం పొందుతారు. విద్యార్థులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2, 3 పాదాలు
ఈ వారం అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సంతృప్తికరం. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. పనుల్లో అవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా తెలియజేయండి. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం  సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రిప్రజెంటేటివ్‌లు టార్గెట్లను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. సహోద్యోగుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. టెండర్లు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. ఆది, సోమవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. స్వయం కృషితో రాణిస్తారు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి. శుభకార్యంలో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. కీలక సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. గృహం సందడిగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ముఖ్యమైన పనులు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. మంగళ, బుధవారాల్లో ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు అదనపు బాధ్యతలు స్థానచలనం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. 
 
ధనుర్‌రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం 
ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. గురు, శుక్రవారాల్లో నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ఆప్తుల సలహా పాటించండి. ఆర్థికంగా కుదుటపడతారు. రుణ బాధలు తొలగిపోతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. దైవ, పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. 
మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాహయత్నాలు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పొదువు పథకాలపై దృష్టిసారిస్తారు. పెద్దమొత్తం ధనసాయం తగదు. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం అనుకూలించదు. సంతానం ఉన్నత చదవుల గురించి ఆలోచిస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఏజెన్సీలు, ధనప్రలోభం తగదు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు శ్రమ అధికం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. 
ఖర్చులు సంతృప్తికరం విలాస వస్తువులు అమర్చుకుంటారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. చెల్లింపులు చెక్కుల జారీలో జాగ్రత్త. సంప్రదింపులు, ఒప్పందాలకు అనుకూలం. ఆది, సోమవారాల్లో స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇంటా, బయటా అనుకూలతలు ఉంటాయి. గృహమార్పు కలిసివస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వేడుకల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పెట్టుబడులపై ఆసక్తి కనపరుస్తారు. ఓర్పుతో వ్యవహరించాలి. మంగళ, బుధవారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. యత్నాలు విరమించుకోవద్దు. పనులు సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆదాయం, ఆరోగ్యం సంతృప్తికరం. ఊహించని ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. మీ పథకాలు నిదానంగా ఫలితాలనిస్తాయి. పనివారలతో జాగ్రత్త. ఉద్యోగ భద్రతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా పొరపాట్లు దొర్లవచ్చు. అధికారులు ధనప్రలోభం తగదు. ఒక సంఘటన తీవ్ర ప్రభావం చూపుతుంది. విద్యార్థుల్లో ఆందోళన తొలగుతుంది.