ఆదివారం, 3 ఆగస్టు 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 జులై 2025 (23:13 IST)

Thursday Fast: గురువారం బృహస్పతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Brihaspati puja
Brihaspati puja
ఒక వ్యక్తి ఆరోగ్యం, సంపద, కీర్తిని సంపాదించాలంటే గురువారం బృహస్పతిని పూజించాలి. అలాగే గురువారం పూట గురు భగవానుడిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురువార వ్రతాన్ని ఆచరించడం వలన  జ్ఞానానికి కేంద్రబిందువు, అన్ని దేవతలకు గురువు అయిన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. 
 
పురాణాలు బృహస్పతి విష్ణువు అవతారమని వివరిస్తాయి. కాబట్టి, స్వచ్ఛమైన హృదయంతో ఈ ఉపవాసం పాటించడం వల్ల భక్తుడి అన్ని కోరికలు నెరవేరుతాయి. 
 
గురువారం బృహస్పతి గ్రహానికి ప్రార్థనలు చేయడం వల్ల అన్ని పాపాలు నాశనం అవుతాయని, అహం, దురాశ తొలగించబడి జ్ఞానంతో శాంతి లభిస్తుంది. నవగ్రహాలలో గురువు అత్యున్నత గ్రహం. జీవితంలో విజయం, వైద్యం, దృష్టి, మేధో, జ్ఞానం, ఆధ్యాత్మికత, అవకాశాలు, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వం, అదృష్టానికి ఈయన కారకుడు. 
 
చాలా మంది భక్తులు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి గురువార ఉపవాసం పాటిస్తారు, అతను విష్ణువు అవతారం అనే నమ్మకంతో ఉపవాసం వుంటారు. ఇలా 16 నిరంతర గురువారాలు ఉపవాసం వుండటం లేదా మూడేళ్ల పాటు గురువారాల్లో ఉపవాసం వుండే వారికి సర్వాభీష్ఠాలు సిద్ధిస్తాయి. 
 
వేదాలలో అతి పురాతనమైన ఋగ్వేదం మొదటి విశ్వ కాంతి నుండి బృహస్పతి జన్మించినట్లు చెప్తారు. ఈయవ చీకటిని తరిమికొట్టేవాడు. ఈయన పవిత్రుడు, సత్వగుణం కలిగిన ఋషిగా వర్ణిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, బృహస్పతి బృహస్పతి గ్రహం నవగ్రహాలలో భాగం, ఈ గ్రహం శుభప్రదం. అందుకే ప్రతి గురువారం బృహస్పతి, విష్ణువును పూజిస్తారు.
 
పఠించవలసిన మంత్రాలు:
 
ఓం బ్రిం బృహస్పతయే నమః
ఓం గ్రామ్ గ్రిం గ్రౌం సః గురవే నమః