ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (15:50 IST)

కేంద్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు సీరియస్.. కోవిడ్ వ్యాప్తికి..?

కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాసు హైకోర్టు సోమవారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో రెండో దశ కోవిడ్ వ్యాప్తికి ఈసీదే బాధ్యతని పేర్కొంది. ''ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి. విధులను సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం చెందడంపై ప్రాసిక్యూట్ చేయాలి'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
కరోనా వేళ ఎన్నికల ర్యాలీలను ఈసీ నిరోధించలేకపోయిందని, రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు, ప్రోటాకాల్స్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా మిన్నకుండిపోయిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. 
 
ఓట్ల లెక్కింపు రోజైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించిది. ఇందుకు సంబంధించిన ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. 30వ తేదీలోగా ఓట్ల లెక్కింపు ప్రణాళిక ఇవ్వకుంటే తమిళనాడులో ఓట్ల లెక్కింపు ఆపేస్తామని హెచ్చరించింది. ఈనెల 6న ఒకే విడతలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.