ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (10:55 IST)

ప్రధాన రహదారిపై ఏనుగు బీభత్సం.. వీడియో వైరల్

elephant
ప్రధాన రహదారిపై ఓ వాహనంపై అడవి ఏనుగు దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన అసోంలోని ఆర్మీ రోడ్డులో చోటుచేసుకుంది. 
 
ఈ వైరల్ వీడియోలో, ఏనుగు ఒక వాహనంపై దాడి చేయడం, ఇతర బాటసారులు వారి వాహనాలను రెండు వైపులా ఆపడం కనిపించింది. ఆగ్రహించిన ఏనుగు పదేపదే వాహనంపై దాడి చేసి రెండుసార్లు తిప్పింది. 
 
ఘటనా స్థలంలో ఉన్న వారు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాహనంలో ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు.