1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 20 సెప్టెంబరు 2021 (07:23 IST)

బజ్వాను సిద్దూ కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలె

‘‘సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందే. సిద్దూ పాకిస్తాన్ వెళ్లి బజ్వాను కౌగిలించుకోవడం చాలా తీవ్రమైన పరిణామం. అమరీందర్ చెప్పింది కరెక్టే. సిద్ధూ మోసగాడు’’ అని కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె అన్నారు.

పంజాబ్ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలంటూ ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు.

ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్‌ను తీవ్రంగా అవమానించింది. అలాంటి పార్టీలో ఆయన ఉండాల్సిన అవసరం లేదు.

కాంగ్రెస్ పార్టీ వీడి ఎన్డీయేలోకి రావాలని నేను ఆయనకు విజ్ణప్తి చేస్తున్నాను. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుంది. అంతే కాదు, కెప్టెన్ ఎన్డీయేలోకి వస్తే పంజాబ్‌లో ఎన్డీయే అధికారంలోకి వస్తుంది’’ అని అన్నారు.