మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (08:51 IST)

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు మృతి

జమ్ముకాశ్మీర్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. బుద్గాం జిల్లాలోని మౌచువా ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు.

ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో...ప్రతిఘటించే క్రమంలో భద్రతా దళాలు ఎదురు దాడికి దిగాయని తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని పేర్కొన్నారు.