జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌ కౌంటర్‌

terrorists
ఎం| Last Updated: ఆదివారం, 30 ఆగస్టు 2020 (20:42 IST)
జమ్మూ కాశ్మీర్‌లో ఆదివారం మరో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. భద్రతా సిబ్బంది, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక జవానుతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు.

శ్రీనగర్‌లోని పాంతా చౌక్‌ వద్ద సిఆర్‌పిఎఫ్‌ దళాలు, పోలీసులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని, భద్రతా సిబ్బంది కూడా ధీటుగా ఎదుర్కొన్నాయని అన్నారు. గంటలపాటు జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఎఎస్‌ఐ బబూరామ్‌ మరణించినట్లు జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, మూడురోజుల వ్యవధిలో పది మంది ఉగ్రవాదులపై సిఆర్‌పిఎఫ్‌ జవానులు కాల్పులు జరిపారు.

పుల్వామా జిల్లాలోని జాదూరా ప్రాంతంలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు, సోపియాన్‌ జిల్లాలోని జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.
దీనిపై మరింత చదవండి :