ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (20:03 IST)

వర్క్ ఫ్రం హోమ్ కల్చర్‌కు బైబై చెప్పేయనున్న ఐటీ కంపెనీలు?

Working Woman
వర్క్ ఫ్రం హోమ్ కల్చర్‌కు ఐటీ కంపెనీలు స్వస్తి పలికేలా వున్నాయి. ఇందులో భాగంగా కీలక చర్యలు చేపట్టాయి. పూణే, బెంగళూరు వంటి ఐటీ నగరాల్లో అధిక శాతం కంపెనీలు ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. 
 
ప్రస్తుతం అమలవుతున్న హైబ్రీడ్ మోడల్‌కు ముగింపు పలికి, టెక్కీలు వారానికి ఐదు రోజుల పాటు ఆఫీసుకొచ్చి పనిచేయాలంటూ ఐటీ కంపెనీలు సిద్ధమైనాయి. 
 
అయితే, ఉద్యోగుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉండటంతో సంయమనం పాటిస్తూ ‘వర్క్ ఫ్రం హోం’ను ముగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.