గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (10:00 IST)

అమ్మాయినని చాటింగ్ చేశాడు.. ఇంటికెళ్లి కత్తితో దాడి చేశాడు.. రెండో అంతస్తు నుంచి దూకేశాడు..

అమ్మాయినంటూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేశాడు. కానీ అతడు అబ్బాయని తేలడంతో చాటింగ్ వద్దనుకుంది. అంతే ఇంటికెళ్లి చాటింగ్ ఎందుకు ఆపేశావని అడిగాడు. మోసం చేసావని ఆ యువతి అనడంతో కోపంతో ఊగిపోయిన అబ్బాయి.. యువతితో

అమ్మాయినంటూ ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేశాడు. కానీ అతడు అబ్బాయని తేలడంతో చాటింగ్ వద్దనుకుంది. అంతే ఇంటికెళ్లి చాటింగ్ ఎందుకు ఆపేశావని అడిగాడు. మోసం చేసావని ఆ యువతి అనడంతో కోపంతో ఊగిపోయిన అబ్బాయి.. యువతితో పాటు ఆమె తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ నగరానికి చెందిన 24 ఏళ్ల అమిత్ యాదవ్ ‘అధర్వ’ పేరిట అమ్మాయినంటూ 17 ఏళ్ల ప్రియా రావత్ తో చాటింగ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత అధర్వ నకిలీ పేరని అసలు పేరు అమిత్ యాదవ్ అనే యువకుడని తెలుసుకున్న ప్రియా ఆయనతో చాటింగ్ చేయడం నిలిపివేసింది.

దీంతో అమిత్ యాదవ్ గీతానగర్‌లోని ప్రియా ఇంటికి వచ్చి తనతో ఫేస్‌బుక్‌లో ఎందుకు చాటింగ్ చేయడం లేదని ప్రశ్నించాడు. దీంతో అమ్మాయి అనుకుని చాటింగ్ చేశానని.. తనకు నీవెవరో తెలియదని ప్రియా యాన్సర్ ఇచ్చింది. 
 
అంతే వెంట తెచ్చిన కత్తితో అమిత్ యాదవ్ ప్రియాపై దాడి చేయబోగా ప్రియా తల్లి కిరణ్ అడ్డు వచ్చింది. అంతే యాదవ్ జరిపిన దాడిలో తల్లీ కూతుళ్లు గాయపడ్డారు. తల్లీకూతుళ్లపై దాడికి పాల్పడిన అనంతరం నిందితుడు రెండో అంతస్తు నుంచి దూకేసి కాళ్లు విరుచుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.