గోవాలో సునామీ సైరన్.. భయపడిపోయిన ప్రజలు
గోవాలో సునామీ సైరన్ మోగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పనాజీ సమీపంలోని పోర్వోరిమ్ ప్రాంతంలో వున్న కొండపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది సునామీ వచ్చే విపత్తును ముందే పసిగట్టి సైరన్ ద్వారా హెచ్చరిస్తుంది.
ఒక్కసారిగా సైరన్ మోగడంతో ప్రజలు షాక్ అయ్యారు. సునామీ వస్తుందేమోనని భయపడ్డారు. 20 నిమిషాల పాటు సైరన్ మోగింది. సాంకేతిక సమస్య వల్ల ఈ సైరన్ మోగిందని అధికారులు తెలపడంతో హమ్మయ్య అంటూ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.