శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2016 (11:52 IST)

పారికర్ కళ్లు పీకేస్తారా?రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉగ్రదాడులు తప్పవ్: ఫరూక్ అబ్ధుల్లా

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్త

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఒమర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పిస్తూ, రెచ్చగొట్టడం వల్లే... వాళ్లు నగ్రోటా పట్టణంపై దాడి చేసి, ఏడుగురు సైనికులను హతమార్చారన్నారు. ఈ ఉగ్రదాడికి కేంద్రమంత్రులే కారణమని అన్నారు. 
 
దక్షిణ కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన పార్టీ సమావేశంలో ఒమర్ మాట్లాడుతూ.. పెద్దనోట్లను రద్దు చేస్తే ఉగ్రవాదం అంతమవుతుందని ఓ వైపు ప్రధాని మోడీ చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే అందుకు విరుద్ధంగా ఉగ్రదాడులు పెచ్చరిల్లిపోతున్నాయని ఒమర్ అబ్ధుల్లా ఎద్దేవా చేశారు. 
 
భారత్ వైపు చెడు దృష్టితో చూస్తే కళ్లు పీకేస్తామని రక్షణ మంత్రి పారికర్ చేసిన వ్యాఖ్యలను ఒమర్ తప్పుబట్టారు. రక్షణ మంత్రే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, నగ్రోటా లాంటి ఉగ్రదాడులు తప్పవని హెచ్చరించారు. 
 
జమ్మూకాశ్మీర్‌లోని టెర్రరిస్టులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని, భారత సైన్యమంతా కలిసినా వారిని అడ్డుకోలేరని సీనియర్, మాజీ సీఎం ఫరూక్ అబ్ధుల్లా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికి వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరోసారి తన కామెంట్స్‌తో వేడి పుట్టించారు.