గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 మార్చి 2021 (17:51 IST)

ఫైవ్‌స్టార్‌ హోటల్‌... కిచెన్ స్టాఫ్‌కు కోవిడ్ పాజిటివ్.. హోటల్‌కు సీల్

Corona
ఉత్తరప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పని చేస్తున్న కిచెన్‌ స్టాఫ్‌ వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమవుతోంది. స్పందించిన అధికారులు సదరు హోటల్‌కు సీల్‌ వేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో నగరంలోని రాడిసన్‌ హోటల్‌లో పని చేస్తున్న తొమ్మిది కిచెన్‌ సిబ్బంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో వారిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించి, హోటల్‌కు సీల్‌ వేశారు. కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఇటీవల హోటల్‌కు వచ్చి వెళ్లిన వారిని గుర్తించడం కొంత కష్టంగా మారింది. 
 
ఇదిలా ఉండగా.. 75 జిల్లాలున్న ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 41 జిల్లాల్లో ఒక్క కొవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. మంగళవారం నోయిడాలో తొమ్మిది, ఘజియాబాద్‌లో మూడు పాజిటివ్‌ కేసులు గుర్తించారు. లక్నోలో కేవలం 25 పాజిటివ్‌ కేసులు మాత్రమే రికార్డయ్యాయని అధికారులు తెలిపారు.