గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (20:33 IST)

హోటల్ గదిలో కాబోయే భర్తతో వీజే చిత్ర... ఏం జరిగిందోగానీ..? (Video)

తమిళ బుల్లితెర నటి వీజే చిత్ర ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్తను హోటల్ గది నుంచి బయటకు పంపించి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. 
 
పలు టీవీ సీరియల్స్‌లో నటించిన వీజే చిత్ర మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా, విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ అనే సీరియల్‌లో ముల్లా పాత్రను పోషిస్తూ పేరు తెచ్చుకుంది. ఈమె త్వరలోనే హేమంత్ రవి అనే వ్యక్తిని పెళ్ళి చేసుకోనుంది. 
 
ఈ క్రమంలో వారిద్దరూ ఓ స్టార్ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటివరకు కాబోయే భర్తతో అనేక విషయాల గురించి మాట్లాడిన వీజే చిత్ర... హేమంత్ రవిని గది నుంచి బయటకు పంపించి గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుంది. 
 
అదీకూడా అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో షూటింగ్ నుంచి వచ్చిన చిత్ర ఆ తర్వాత స్నానానికి అని బాత్ రూమ్‌లోకి స్నానం చేసి వచ్చి కాబోయే భర్తతో కొద్దిసేపు మాట్లాడి, ఆ తర్వాత హేమంత్‌ను బయటకు పంపించింది. 
 
పిమ్మట ఎంత సేపటికి రాకపోవడంతో కాబోయే భర్త హేమంత్ హోటల్ సిబ్బంది నుంచి డూప్లీకేట్ కీ తీసుకొని తలుపులు తెరిచి చూడగా.. చిత్ర సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. షాక్‌కు గురైన అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని, పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.