గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (14:53 IST)

ఏం కష్టమొచ్చిందో... కన్నబిడ్డలను చూస్తూ.. సెల్ఫీ తీస్తూ మహిళ బలన్మవరణం

హైదరాబాద్ నగరంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ బలవన్మరణం చెందింది. ఆమెకు ఎలాంటి కష్టమొచ్చందో ఏమో తెలియదుగానీ, నవమాసాలు పెంచి కని పెంచిన కన్నబిడ్డలను చూస్తూ, సెల్ఫీ తీసుకుంటూ తనువుచాలించింది. తల్లిని కాపాడలేక ఆ చిన్నారులు పడిన వేదన అరణ్యరోదనే అయింది. అమ్మ ఇక లేదని తెలిసి ఆ బాలురిద్దరూ దీనంగా విలపిస్తుండడం చూపరుల హృదయాలను ద్రవించివేస్తోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాలాపేటకు చెందిన మంజుల అనే మహిళకు 12 యేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. ఈమె భర్త లాలాపేట్ మెయిన్ రోడ్డులో బేకరీ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి రంజిత్, తేజస్ అనే ఇద్దరు కుమారులున్నారు. 
 
అయితే శనివారం నాడు మంజుల తన బిడ్డలు చూస్తుండగానే ఉరేసుకుంది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని రంజిత్, తేజస్ బేకరీలో ఉన్న తమ తండ్రికి ఫోన్ చేసి చెప్పారు.
 
కానీ భర్త వచ్చేసరికి మంజుల ప్రాణాలు విడిచిపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మంజుల మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.