శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 డిశెంబరు 2020 (09:14 IST)

భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ కార్పొరేటర్లు...

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఆదివారం ఛార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అనుకున్న దానికన్నా ఎక్కువగానే బీజేపీ సీట్లు సాధించింది. ఈ క్రమంలో తాజాగా ఆదివారం గ్రేటర్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు పాతబస్తిలోని ఛార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు. 
 
48 మంది కార్పొరేటర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. దీంతో భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.