మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (10:10 IST)

తెలంగాణలో తగ్గని కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య

తెలంగాణ కరోనా కేసుల సంఖ్య తగ్గినా.. కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తెలంగాణ ఆరోగ్యశాఖ తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా మరో 596 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో ముగ్గురు మృతి చెందారు.

తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 2,72,719 కరోనా కేసులు నమోదు కాగా, అందులో 2,62,751 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక 8,498 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 1470 మంది కరోనాతో మృతి చెందారు. శుక్రవారం ఒక్కరోజే 59,471 పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 57,22,182 పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 59,471 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 102 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.