గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 డిశెంబరు 2020 (17:39 IST)

హైదరాబాదులో ఆటోమొబైల్‌ సేవా ప్రదాత గో మెకానిక్‌ స్పేర్‌పార్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఔట్‌లెట్‌ ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద సాంకేతిక ఆధారిత బహుళ బ్రాండ్‌ కార్‌ వర్క్‌షాప్స్‌తో కూడిన నెట్‌వర్క్‌ కలిగిన గో మెకానిక్‌ తమ గో మెకానిక్స్‌ స్పేర్స్‌ ఆధీకృత డిస్ట్రిబ్యూటర్‌ స్టోర్‌- ఎస్‌ఎం ఆటోమొబైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను 30 నవంబర్‌ 2020వ తేదీన తెరిచినట్లు ప్రకటించింది. ఇటీవలే ఆటో విడిభాగాల మార్కెట్‌లోకి తమ నూతన బ్రాండ్‌ గోమెకానిక్‌ స్పేర్స్‌ ద్వారా గో మెకానిక్‌ ప్రవేశించడంతో పాటుగా తమ మొత్తం శ్రేణి మల్టీ బ్రాండ్‌ ఉత్పత్తులను తమ డిస్ట్రిబ్యూటర్‌ ఔట్‌లెట్‌ ద్వారా పంపిణీ చేయనుంది. మొబిల్‌, గల్ఫ్‌, మోన్రో, బోష్‌, వాలియో, పురోలేటర్‌, లివ్‌గార్డ్‌, లుమాక్స్‌, లక్‌, ఎన్‌జీకె, సుబ్రొస్‌ మరియు యూరోర్‌పార్‌ వంటి బ్రాండ్లు గోమెకానిక్‌ స్పేర్స్‌ లభ్యమవుతాయి.
 
గోమెకానిక్స్‌ స్పేర్స్‌ డిస్ట్రిబ్యూటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం ద్వారా, ఈ బ్రాండ్‌ ఇప్పుడు తమ విడిభాగాల వ్యాపారాన్ని టియర్‌ 2, టియర్‌ 3 నగరాలకు విస్తరించడంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన విడిభాగాల సరఫరాలో ఉన్న సమస్యలకు తగిన పరిష్కారం సైతం అందించనుంది. స్థిరమైన నెట్‌వర్క్‌తో కూడిన 10 సేవా కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటుచేయడం ద్వారా నగరంలో అందుబాటు ధరలో నమ్మకమైన కారు మరమ్మత్తులను అందించనుంది.
 
ఈ బ్రాండ్‌ ఇప్పుడు ప్రస్తుత మరియు భవిష్యత్‌ విడిభాగాల రిటైలర్లు మరియు పంపిణీదారులు మరియు వర్క్‌షాప్‌ యజమానుల అవసరాలను సైతం తీర్చనుంది. ఈ డిస్ట్రిబ్యూటర్‌ ఇప్పుడు అగ్రశ్రేణి బ్రాండ్ల అసలైన విడిభాగాలను సరఫరా చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటుగా సుప్రసిద్ధ తయారీదారులు, సరఫరాదారులతో గో మెకానిక్స్‌ యొక్క దేశవ్యాప్త భాగస్వామ్యాలతో అత్యుత్తమ రాయితీలను సైతం అందించనుంది.
 
డిస్ట్రిబ్యూటర్‌ స్టోర్‌ ప్రారంభం సందర్భంగా శ్రీ నితిన్‌ రానా, కో-ఫౌండర్‌, గో మెకానిక్‌ మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రవేశించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ మార్కెట్‌ మమ్మల్ని అసలు నిరుత్సాహ పరచలేదు. నగరంలో మా మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్‌ షాప్‌  ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌ ఆటో మార్కెట్‌లో సుదీర్ఘమైన అనుబంధం కోసం ఎదురుచూస్తున్నాము. మా వినియోగదారులందరికీ వేగవంతమైన మరియు అందుబాటు ధరల పరిష్కారాలను అందించాలన్నది మా లక్ష్యం. లాక్‌డౌన్‌లో సైతం వృద్ధిని  చూసిన వేళ, మా దైన మార్గం సృష్టించుకోవడం పట్ల సానుకూలంగా ఉన్నాము’’ అని అన్నారు.