శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఇంట్లోకి చొరబడి వివాహితపై అత్యాచారం.. గర్భందాల్చిన బాధితురాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ కామాంధుడు ఓ 50 యేళ్ళ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త చనిపోయి విధవరాలిగా ఉన్న ఆ మహిళ గర్భందాల్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో లక్నోకు సమీపంలోని కోత్వాలికి చెందిన అఖిలేష్‌ అహిర్వర్‌ అనే వ్యక్తి గత నెల డిసెంబర్‌ 7వ తేదీన ఓ మహిళ ఇంట్లోకి చొరబడి.. ఆ తర్వాత ఆమెను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
దీంతో సదరు మహిళ గర్భం దాల్చింది. దీనిపై నిందితుడ్ని నిలదీయగా చంపుతానని బెదిరించాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అతడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.