శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (08:51 IST)

లవ్ అగర్వాల్ సోదరుడు అనుమానాస్పద మృతి

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్న లవ్ అగర్వాల్ సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈయన పేరు అంకుర్ అగర్వాల్. ఈయన మృతదేహం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్ పూర్ ఏరియాలో లభించింది. ఈ విషయం తెలిసిన లవ్ అగర్వాల్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. 
 
సహరన్ పూర్ లోని పిల్కానీ ఏరియాలో ఓ ఫ్యాక్టరీ వద్ద అంకుర్ మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటన స్థలంలో ఓ లైసెన్స్‌డ్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. 
 
కాగా, లవ్, అంకుర్‌ల తండ్రి కేజీ అగర్వాల్ సహరన్ పూర్ ప్రాంతంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ఇక లవ్ అగర్వాల్ 1996 బ్యాచ్ ఏపీ క్యాడర్ అధికారి. ఇటీవలకాలంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక లవ్ అగర్వాల్ నిత్యం మీడియా ముందుకు వచ్చి కరోనా కేసులు వివరాలు వెల్లడిస్తూ వచ్చారు. ఇలా ఈయన పేరు వెలుగులోకి వచ్చింది