బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (18:19 IST)

చెన్నైలో ఆస్ట్రేలియన్‌ గుడ్లగూబ.. రెక్కలకు గాయాలు..

Owl
తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని  ఆవడి సమీపంలో ఓ ఆస్ట్రేలియన్‌ గుడ్లగూబ కనిపించింది. ఎగరలేని స్థితిలో ఉన్న ఆస్ట్రేలియన్ గుడ్లగూడను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అక్కడికి వచ్చిన అధికారులు ఆ గుడ్లగూబను తీసుకెళ్లి చికిత్స అందించారు.

ప్రస్తుతం గుడ్లగూడ బాగానే ఉందని తెలిపారు. తిరువళ్లూర్‌ జిల్లా వేపంబట్టు ప్రాంతంలో ఆదివారం (జూన్ 6,2021) ఉదయం హఠాత్తుగా గుడ్లగూబ ఎగురుతూ కింద పడింది.
 
అదేదో కొత్తగా వింతగా ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలించారు. పాపం దాని రెక్కలకు గాయాలు కావడంతో గుడ్లగూబ ఎగురలేకపోయిందని గుర్తించారు.

అనంతరం స్థానికంగా ఉండే ఓ బాలుమురుగన్‌ అనే జంతు ప్రేమికుడికి విషయం చెప్పారు. దాంతో బాలమురుగన్ ఆ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 
 
ఆపై అక్కడకు వచ్చిన అధికారులు గుడ్లగూబను పరిశీలించి.. అది ఆస్ట్రేలియా దేశానికి చెందిన అరుదైన గుడ్లగూబగా గుర్తించారు. గద్దలు, కాకులు వంటి పక్షులు దాడిచేయడంతో గాయాలయ్యాయని అంచనా వేశారు.

దానికి ప్రాథమిక చికిత్సలు అందజేసి కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా గుడ్లగూబలు పగటి సమయంలో బయటకు రావు కేవలం రాత్రి సమయాల్లోనే ఆహారం కోసం బయటకు వస్తాయి.