సోమవారం, 24 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 మార్చి 2025 (10:50 IST)

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

Oil Refinery Blast
హర్యానా రాష్ట్రంలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అదే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. 
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ సిలిండర్ కారణంగానే ఈ పేలుడు సంభవించివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఈ పేలుడు పడక గదిలో జరిగిందని అంటున్నారు. 
 
కాగా, ఈ పేలుడుపై డీసీపీ మయాంక్ మిశ్రా స్పందిస్తూ, ఇది సిలిండర్ పేలుడు కాదు. పేలుడు బెడ్ రూమ్‌లో జరిగింది. దీని ప్రభావం మొత్తం ఇంటిపై పడింది. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు అని వెల్లడించారు. 
 
ఎయిర్ కండిషనర్‌ కంప్రెషర్‌ కారణంగా పేలుడు జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. పేలుడు కారణంగా ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపకదళ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నాలుగు మృతదేహాలను వెలికి తీశారు.