శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (10:54 IST)

బ్యాంకుల సైట్లు భద్రంగా లేవు.. 3 గంటల్లోనే హ్యాంకింగ్... బ్యాంకింగ్ ఆన్‌లైన్ విధానం వీకే

సైబర్ దొంగల బారినపడనంత భద్రంగా బ్యాంకులు లేవని తేలిపోయింది. ఎందుకంటే బ్యాంకుల సైట్లు హ్యాకింగ్‌ గురయ్యేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కొంతమంది ఎథికల్‌ హ్యాకర్లు ప్రూవ్‌ చేశారు. కేవలం మూడు గంటల్ల

సైబర్ దొంగల బారినపడనంత భద్రంగా బ్యాంకులు లేవని తేలిపోయింది. ఎందుకంటే బ్యాంకుల సైట్లు హ్యాకింగ్‌ గురయ్యేందుకు అనుకూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని కొంతమంది ఎథికల్‌ హ్యాకర్లు ప్రూవ్‌ చేశారు. కేవలం మూడు గంటల్లోనే ఓ బ్యాంక్ సైటును వారు హ్యాక్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. గుర్గావ్‌లో ఓ ఎథికల్‌ హ్యాకింగ్‌ సంస్థ ఉంది. ఇది ఆయా కంపెనీలకు వచ్చే హ్యాకింగ్‌ సమస్యలు, ఇతర సాఫ్ట్‌వేర్‌ సమస్యలు చూస్తుంటుంది. ఈ కంపెనీ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల ఆన్‌లైన్‌ లావాదేవీలు ఎంతమేరకు భద్రం అనే విషయాన్ని పరీక్షించింది.
 
ఇందులో భాగంగా ఐదుగురు ఎథికల్ హ్యాకర్లతో ఈ పరీక్ష చేయించింది. వీరిలో హ్యారీ (హర్జిత్‌) అనే ఎథికల్‌ హ్యాకర్‌ ఓ బ్యాంకును హ్యాక్‌ చేశాడు. ఆ బ్యాంకు సంబంధించిన రూటర్‌ను మూడు గంటల్లో తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దీంతో బ్యాంకులు ఏమాత్రం భద్రంగా లేవని తెలిసింది. పాస్‌వర్డ్‌ను తెలుసుకుని దానిని ఇష్టం వచ్చినట్లుగా నియంత్రించగలిగానని హ్యాకర్ చెప్పాడు. 
 
ప్రతి ఖాతాదారుడి రిక్వెస్ట్‌ను ఇతర ప్రైవేట్‌ సైట్‌కు కేటాయించి వారి ద్వారా లోగిన్‌ పాస్‌వర్డ్‌ అడిగి అన్నింటిని తెలుసుకోగలను. దీంతో ఆ బ్యాంకుకు సంబంధించిన ఖాతాదారుల సొమ్మంతా నేను కొల్లగొట్టొచ్చునని హ్యాకర్ అని హ్యారీ చెప్పాడు. అయితే, ఇలా చేయడం తన ఉద్దేశం కాదని, మన బ్యాంకింగ్‌ ఆన్‌లైన్‌ విధానం ఎంత బలహీనంగా ఉందో చెప్పేందుకే ఇలా చేశామన్నాడు.