బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (11:18 IST)

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు.. యమునా నదిలో దూకేయాలనుకుంది.. గూగుల్ కాపాడింది..

ప్రేమ విఫలమైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. యూపీ బరేలీకి చెందిన ఓ 24 ఏళ్ల అమ్మాయి ప్రేమ విఫలమైందని, ప్రేమించిన యువకుడు ఆమెను వదిలేశాడని యుమునా నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని

ప్రేమ విఫలమైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. యూపీ బరేలీకి చెందిన ఓ 24 ఏళ్ల అమ్మాయి ప్రేమ విఫలమైందని, ప్రేమించిన యువకుడు ఆమెను వదిలేశాడని యుమునా నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకుంది.

అందుకే సదరు యువతి గూగుల్‌పై ఆధారపడింది. ఎలాగంటే? ఎలా ఆత్మహత్య చేసుకోవాలి అని గూగుల్‌లో సర్చ్ చేసింది. దీంతో గూగుల్‌లో కొన్ని హెల్ప్‌లైన్ నెంబర్ ఆమెకు కనిపించింది.
 
ఆ ఆమ్మాయి తన ఆత్మహత్యను కాస్త వాయిదా వేసి ఆ నెంబర్‌కి ఫోన్ చేసింది. అయితే ఆ అమ్మాయికి తెలియని విషయం ఏమిటంటే అది హెల్ప్‌లైన్ నెంబర్ కాదు.. తన ఆత్మహత్యను అడ్డుకొనే నెంబర్ అని. ఇది తెలుసుకోకుండానే.. సదరు అమ్మాయి చేసిన ఫోన్‌ను స్థానిక డిఐజి జితేంద్ర కుమార్ సహాని రిసీవ్ చేసుకున్నారు. 
 
అమ్మాయితో మాట్లాడిన ఆయన ఆమెను ఆత్మహత్యాయత్నం నుంచి తప్పించారు. ఆఫీసుకు రప్పించి.. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. దీంతో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి ముగింపు పలికింది. ఇలా గూగుల్ ఆ యువతిని కాపాడింది.