మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (15:36 IST)

రూ. 50వేలకు బాలికను అమ్మేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

మంచి హోదాలో ఉన్న యువకుడితో పెండ్లి చేయిస్తామని నమ్మబలికి బాలికను రూ. 50,000లకు ఓ దంపతులు విక్రయించిన దారుణ ఘటన యూపీలోని బదౌన్‌ జిల్లాలో వెలుగుచూసింది. పెళ్లి పేరుతో షహజన్‌పూర్‌ జిల్లా నుంచి తీసుకొచ్చిన నిందితులు బదౌన్‌లోని ఓ వ్యక్తికి అమ్మారు. 
 
ఈ విషయం పోలీసులకు తెలియడంతో బాలికను కొనుగోలు చేసిన వ్యక్తి సహా దంపతులను అరెస్ట్‌ చేశారు. జిల్లాలోని గదియ హర్దోపట్టి గ్రామానికి చెందిన రాజ్‌వీర్‌ బాలికను రూ 50,000కు కొనుగోలు చేసినట్టు సమాచారం.
 
మంజు దేవి, కృష్ణపాల్‌ దంపతులు బాలికకు పెండ్లి చేసి మంచి కుటుంబంలోకి పంపిస్తామని మహిళను నమ్మబలికి ఆమె కుమార్తెను బదౌన్‌ జిల్లాకు తీసుకువచ్చి రాజ్‌వీర్‌కు అమ్మారని పోలీసులు తెలిపారు. మంజు బాధితురాలి గ్రామానికి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. 
 
రాజ్‌వీర్‌ తీరు నచ్చని బాధితురాలు నిందితులు తనను ఆయనకు విక్రయించారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బాలికను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.