శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (15:19 IST)

గోల్డెన్ బాబాకు భారీ భద్రత.. 20కిలోల బంగారంతో యాత్ర.. ఎక్కడ?

అమాయక ప్రజల వద్ద దోచుకుంటున్న బాబాలు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉండే బాబాల్లో సుధీర్‌ మక్కర్‌ ఒకరు. ఇతను గోల్డెన్ బాబాగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. బాబాగా మారకముందు గోల్డె

అమాయక ప్రజల వద్ద దోచుకుంటున్న బాబాలు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ముందు వరుసలో ఉండే బాబాల్లో సుధీర్‌ మక్కర్‌ ఒకరు. ఇతను గోల్డెన్ బాబాగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. బాబాగా మారకముందు గోల్డెన్ బాబా ఢిల్లీలో వస్త్ర వ్యాపారం చేసేవారు. పలు క్రిమినల్‌ కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఒంటినిండా బంగారం వేసుకుని ప్రతీ ఏడాది ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు కన్వార్‌ పేరిట యాత్ర నిర్వహిస్తారు. 
 
ఇదే తరహాలో ఈ సంవత్సరం ఒంటిమీద 20 కిలోల బంగారంతో యాత్ర చేపట్టారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం దీని విలువ రూ. 6 కోట్లకు వరకు ఉంటుందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఈయన 14.5 కిలోల బంగారం వేసుకోగా, 2016లో 12 కేజీల కాంచనాన్ని ఒంటిపై ధరించారు. ఈ బాబా నిర్వహించే యాత్ర కోసం పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.  
 
దీనిపై గోల్డెన్ బాబా మాట్లాడుతూ.. ఇరవై ఐదేండ్లుగా తాను ఈ యాత్రను చేపడుతున్నానని అన్నారు. బంగారం ధర తులానికి రూ. 200 ఉన్నప్పట్నుంచి తాను యాత్ర చేస్తున్నానని చెప్పారు. వయోభారంతో ఒంటిపై అధిక బంగారం మోయలేకపోతున్నానని బాబా చెప్తున్నారు.