శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (07:47 IST)

కేబుల్ టీవీ వాడేవారికి శుభవార్త!

టారిఫ్ ఆర్డర్ కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ(TRAI) సవరణలు చేసింది. గతంలో ఉన్న బేసిక్ ప్యాక్, అలాకార్ట్ రూల్స్ క్యాన్సిల్ చేసింది. దీంతో కేబుల్ వినియోగదారులపై భారం తగ్గనుంది. 160 రూపాయలకే అన్నీ ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని ట్రాయ్ తెలిపింది.
 
గతంలో కేబుల్ టీవీ, DTH విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది ట్రాయ్. అయితే ట్రాయ్ నిబంధనలు గందరగోళం సృష్టించాయి. వినియోగదారులపై భారం పడింది. దీంతో ట్రాయ్‌ కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులన్నీ పరిశీలించిన ట్రాయ్ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకటించింది.
 
ఇకపై రూ.160 చెల్లించినవారికి 200 ఛానెల్స్ అందించనుంది. గతంలో రూ.160తో 100 ఛానెల్స్ మాత్రమే వచ్చేవి. ఆ తర్వాత ప్రతీ 25 ఎక్స్ ట్రా ఛానెళ్లకు రూ.20 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు  200 ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ చూడొచ్చు. దాంతో పాటు ప్రసార భారతికి చెందిన దూరదర్శన్ ఛానెళ్లు అదనంగా చూడొచ్చు.

మొత్తం రూ.160 చెల్లించేవారికి అన్ని ఫ్రీ టు ఎయిర్ ఛానెల్స్ ఇవ్వాలని ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకటించింది. ఇకపై బొకే ఛానెల్స్ లో ఒక ఛానెల్స్ ఖరీదు రూ.12 మించకూడదన్న ట్రాయ్..ప్లేస్ మెంట్ మార్చాలంటే అనుమతి తప్పనిసరని తెలిపింది. ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్స్ ఉంటే 40% వసూలు చేయాలని ట్రాయ్ నిర్ణయించింది. 

డిస్ట్రిబ్యూటర్ ఒక EPG లో ఛానెల్స్ ప్లేస్ మెంట్ మార్చాలంటే అది ఆ భాష ఛానెల్ బంచ్ లొనే ఉండాలని సూచించింది ట్రాయ్. కొత్త రూల్స్ 2020 మార్చి 1నుంచి వర్తిస్తాయని సంస్థ చైర్మన్ ఆర్.ఎస్. శర్మ ప్రకటించారు.