మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:38 IST)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఇందుకు తక్షణ సాయంగా రూ 3,737 కోట్లను విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తాజగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో 30 లక్షలకు పైచిలుకు ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌ రావడంతో దసరా పండుగ సీజన్‌లో మార్కెట్ డిమాండ్‌ పుంజుకుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దసరా లోపు ఉద్యోగుల ఖాతాల్లో బోనస్‌ మొత్తాన్ని ఒకే దపాలో జమవుతుందని కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ వెల్లడించారు.
 
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైల్వేలు, పోస్ట్‌ ఆఫీసులు, ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే 17 లక్షల మంది “నాన్‌ గెజిటెట్‌” ఉద్యోగులతో పాటు, మరో 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధంలేని బోనస్ రానుంది.