ప్రధానమంత్రి ఉజ్వల యోజన.. సిలిండర్‌పై రూ.300 రాయితీ
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) కింద కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ గ్యాస్‌పై రూ.300 రాయితీని అందిస్తోంది. ఈ గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. పీఎంయూవై లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ సిలిండర్ రాయితీ కింద రూ.300 అందిస్తున్నారు.
అక్టోబర్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.300కు పెంచింది. సబ్సిడీ మొత్తాన్ని అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్ నెలలో ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.300కు పెంచింది.