శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 మే 2017 (10:24 IST)

ట్రిపుల్ తలాక్‌ రద్దుకు త్వరలోనే చట్టం తెస్తాం.. కేంద్ర మంత్రి వెంకయ్య

ముస్లిం మహిళల రక్షణార్థం తలాక్ రద్దుకు త్వరలోనే చట్టం తెస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలనేదే బీజేపీ అభిమతమన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ అంశ

ముస్లిం మహిళల రక్షణార్థం తలాక్ రద్దుకు త్వరలోనే చట్టం తెస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సమన్యాయం జరగాలనేదే బీజేపీ అభిమతమన్నారు. ఉమ్మడి పౌరస్మృతి, ట్రిపుల్ తలాక్ అంశాలను ముడిపెట్టొద్దని.. మహిళలపై వివక్ష తొలగించేందుకే ట్రిపుల్ తలాక్‌ను కేంద్రం వ్యతిరేకిస్తోందని వెంకయ్య వెల్లడించారు. ఈ విషయాలను రాజకీయం చేయొద్దని ముస్లిం పర్సనల్ లా బోర్డుకు సూచించారు. రాజకీయాలే చేయాలనుకుంటే ఏదో పార్టీలో చేరొచ్చునని సలహా ఇచ్చారు.
 
మూడుసార్లు తలాక్ చెప్పి మహిళలకు విడాకులిచ్చే పద్దతిని ముస్లిం మతస్థులు మార్చుకోవడంలో విఫలమైతే ప్రభుత్వమే ఒక చట్టం (ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ) తెస్తుందని వెంకయ్య చెప్పుకొచ్చారు. కాగా, ట్రిపుల్ తలాక్ చట్టబద్ధతపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల బెంచ్ గత గురువారంనాడు తీర్పును రిజర్వ్ చేసింది.