సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (15:49 IST)

విశ్వాసానికి మరోపైరు ఎల్.ఐ.సి... భవిష్యత్ అభద్రత : ప్రియాంకా గాంధీ

కోట్లాది మంది విశ్వాసం చూరగొన్న ప్రభుత్వ రంగ బీమా సంస్థ జీవిత బీమా సంస్థ (ఎల్.ఐ.సి). ప్రస్తుతం ఆ సంస్థ మనుగడపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్.ఐ.సి డబ్బును దివాళా తీసిన కంపెనీల్లో పెట్టుబడిగా పెడుతున్నారంటూ ఆమె ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల ఎల్ఐసీ సంస్థ‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం కోల్పోయేలా కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆమె విమర్శించారు. 
 
ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. గ‌త రెండున్న‌ర నెలల్లో ఎల్ఐసీ సంస్థ సుమారు రూ.57 వేల కోట్లు న‌ష్ట‌పోయిందని ఆమె గుర్తుచేశారు. దీనికి సంబంధించి ఓ మీడియా రిపోర్టును ట్యాగ్ చేశారు. భార‌త్‌లో విశ్వాసానికి మ‌రోపేరు ఎల్ఐసీ, భ‌విష్య‌త్తు భ‌ద్ర‌త కోసం పేద ప్ర‌జ‌లు త‌మ సొమ్మును ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేస్తారు, కానీ బీజేపీ ప్ర‌భుత్వం ఆ ఎల్ఐసీ డ‌బ్బును.. న‌ష్ట‌పోయిన కంపెనీల్లో పెట్టుబ‌డి పెడుతోంద‌ని ప్రియాంకా అన్నారు. ఇదేం విధానం, ఇది ఖతంగా న‌ష్ట‌పోయే విధాన‌మే అని ఆమె వ్యాఖ్యానించారు.