మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జనవరి 2020 (08:50 IST)

17న అంతరిక్షంలోకి జిశాట్-30

భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మరో ఉప గ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు రెడీ అవుతోంది. భారీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-30ని ఈ నెల 17న ఫ్రెంచ్‌ గయనాలోని అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ తెలిపారు.

ఇది కొత్త ఏడాదిలో భారత్ అంరిక్షంలోకి పంపనున్న తొలి ఉపగ్రహం. ప్రభుత్వ, ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లకు కమ్యూనికేషన్ మరింత మెరుగుపడేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. 2020లో మొత్తం 25 శాటిలైట్లను అంతరిఓంలోనికి పంపాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివన్ తెలిపారు.