మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (18:37 IST)

రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడా? ఆయనేమంటున్నారు...

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వలింగ సంపర్కుడా? ఈ సందేహంపై అఖిల భారతీయ హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి సమాధానం చెబుతున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 
 
రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అని అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స్వామీ చ‌క్ర‌పాణి ఆరోపించారు. గాడ్సే, సావ‌ర్క‌ర్ స్వ‌లింగ సంప‌ర్కులు అని ఇటీవ‌ల కాంగ్రెస్ ఆరోపించింది. సేవాద‌ళ్ బుక్‌లెట్‌లో కాంగ్రెస్ ఆ ఆరోప‌ణ‌లు చేసింది. దీనిపై హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు రియాక్ట్ అయ్యారు. గాడ్సే, సావ‌ర్క‌ర్‌పై చేసిన ఆరోప‌ణ‌లను స్వామి చ‌క్ర‌పాణి ఖండించారు. రాహుల్ గాంధీ కూడా హోమోసెక్సువ‌ల్ అని విన్న‌ట్లు స్వామీజీ అన్నారు.
 
కాగా, కాంగ్రెస్‌ సేవాదళ్‌ ప్రచురించిన ఓ పుస్తకంలో హిందూ మహాసభ సహ వ్యవస్థాపకుడు వీర్‌ సావర్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, సావర్కర్‌కు మధ్య స్వలింగ సంపర్కం ఉండేదని తెలిపింది. వీర్‌ సావర్కర్‌ వీరత్వం ఎంత? అనే పుస్తకంలో గాడ్సేతో సావర్కర్‌కు స్వలింగ సంపర్క సంబంధం ఉండేదని, మైనారిటీలకు చెందిన మహిళలపై లైంగికదాడులు చేయాలని ఆయన హిందువులను రెచ్చగొట్టేవాడని ఈ పుస్తకంలో ఆరోపించింది.