సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (10:10 IST)

ఈ దేశంలో అతిపెద్ద రేపిస్ట్ నెహ్రూనే : సాధ్వి ప్రాచీ

దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం ఎన్నో రకాలైన కఠిన చట్టాలు, చర్యలు తీసుకుంటున్నప్పటికీ... అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా అత్యాచారాలకు భారత్ కేంద్రంగా మారిందనే అపవాదు ప్రచారంలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సాధ్వి ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అని అన్నారు. రాముడు, కృష్ణుడు సంస్కృతులను ఆయనే ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు..
 
ఈ దేశానికి ఉగ్రవాదం, నక్సలిజం, అవినీతి, లైంగిక దాడి నెహ్రూ కుటుంబ సభ్యులు ఇచ్చిన బహుమతులు అని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే లైంగిక దాడులకు రాజధానిగా భారత్ మారిందన్న రాహుల్ వ్యాఖ్యలకు స్పందించిన సాధ్వి ప్రాచీ ఆదివారం పై విధంగా స్పందించారు.