శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 జులై 2024 (12:47 IST)

వడోదరాలో ఘోరం.. తరగతి గోడ కూలింది.. వరద నీటిలో విద్యార్థులు (వీడియో)

Wall Collapse at Vadodara Private School
Wall Collapse at Vadodara Private School
గుజరాత్‌లోని వడోదరలో ఓ ప్రైవేట్ పాఠశాలలో గోడ కూలి ఒక విద్యార్థికి గాయాలయ్యాయి. ఏడవ  తరగతి చదువుతున్న విద్యార్థికి స్వల్ప గాయాలైనట్లు గుర్తించిన సంఘటన స్థలానికి అత్యవసర సేవలను అందించినట్లు సబ్ ఫైర్ ఆఫీసర్ వినోద్ మోహితే తెలిపారు. 
 
ఇంకా ఈ ఘటనలో విద్యార్థులకు చెందిన 10-12 సైకిళ్లు శిథిలాల కింద పడిపోయాయి. తరువాత వాటిని అగ్నిమాపక శాఖ తొలగించింది. ఈ ఘటనతో పాఠశాలలో భద్రతా చర్యలపై ఆందోళన నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో పాఠశాల తరగదిలో విద్యార్థులున్న తరుణంలో గోడ కూలింది. దీంతో వరద నీరు ఎగబాకింది. ఈ  సందర్భంగా గోడ వైపున్న విద్యార్థులు వరద నీటిలో పడిపోయారు. 
 
ఆపై సహాయక సిబ్బంది వారిని రక్షించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక విద్యార్థికి గాయమైనట్లు సమాచారం వస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల భద్రతపై పాఠశాల యాజమాన్యంపై మండిపడుతున్నారు.