సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (09:27 IST)

గుజరాత్‌లో విషాదం... 65 మంది ప్రయాణికులతో లోయలో పడిన బస్సు!!

car accident
గుజరాత్ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. 65 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. 
 
ఈ బస్సు సూరత్‌లోని సపుతారా పర్వత ప్రాంతం నుంచి తిరిగివస్తుండగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు ప్రయాణికులను స్థానికంగా ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం సేకరిస్తున్నారు.
 
నిరాండబర జీవితం తన తల్లి - అమ్మమ్మల నుంచి నేర్చుకున్నా : సుధామూర్తి
 
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి రూ.కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆమె ఎంతో నిరాడంబరంగా ఉంటారు. దీనివెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆమె బహిర్గతం చేశారు. తాను కాశీకి వెళ్లినపుడు తనకిష్టమైన షాపింగ్ అలవాటును అక్కడే వదిలేశానని చెప్పారు. అలాగే, తను నిరాడంబర జీవన శైలి తనకు తల్లి, అమ్మమ్మల నుంచి వారసత్వంగా సంక్రమించారు. అందుకే తాను ఎల్లవేళలా సాధారణ జీవితం గడిపేందుకు ఇబ్బంది పడలేదన్నారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుగోలు చేయలేదంటూ ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. స్నేహితులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తున్నానని చెప్పారు. తనకు చాల ఇష్టమైన షాపింగ్‌ను కాశీలో వదులుకోవడంతో చీరలు కొనుగోలు చేయలేదని తెలిపారు. తన తల్లి, అమ్మమ్మ అత్యంత సాధారణ జీవితం గడిపారని, వారి నుంచి తనకు నిరాడంబర జీవనశైలి వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కాబట్టి, తను సులువుగా సర్దుకుపోగలిగానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 
 
'ఆరేళ్ల క్రితం నా తల్లి చనిపోయినప్పుడు ఆమె కప్ బోర్డును ఖాళీ చేసేందుకు ఇతరులకు ఇచ్చేందుకు ఎక్కువ సమయం పట్లలేదు. ఎందుకంటే ఆవిడ వద్ద 8 - 10 చీరలే ఉండేవి. 36 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ చనిపోయింది. అప్పట్లో ఆమె వద్ద నాలుగు మాత్రమే ఉండేవి. వారందరూ అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. కాబట్టి, ఆ విలువలతోనే నన్ను పెంచారు. వస్తు వ్యామోహం లేని నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు' అని ఆమె వివరించారు.