ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (22:42 IST)

బాల్కనీ నుంచి కిందపడి భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ మృతి, అది ఆత్మహత్యా?

David Johnson
David Johnson
భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ నాలుగో అంతస్తులోని బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. బెంగళూరులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడటం వల్ల ఆయన తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చేరారు. డేవిడ్ జాన్సన్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం వెల్లడించింది. 
 
అయితే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అపార్టుమెంట్‌లోని నాలుగో ఫ్లోర్‌లో ఆయన ఉంటున్నాడు. బాల్కనీ నుంచి కిందపడిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే ఆసుపత్రికి తరలించామని, కానీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని క్రికెట్ సంఘం ప్రకటించింది.
 
జాన్సన్ తాను ఉండే ఇంటికి సమీపంలో ఓ కోచింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అది సరిగ్గా నడవకపోవడంతో నష్టాలు వచ్చాయని భావిస్తున్నారు. దీంతో జాన్సన్ మానసికంగా దెబ్బతిన్నారని... దీనికితోడు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.