1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (17:16 IST)

నడి రోడ్డుపై, అర్ధరాత్రి అమ్మాయిల సిగపట్టు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్..

భారత దేశ రాజధాని నగరం న్యూ ఢిల్లీ అత్యాచారాల నగరంగా పేరు తెచ్చుకుంది. ఈ మహా నగరంలో గతంతో పోలిస్తే 2014లో నేరాల సంఖ్య 26 శాతం పెరిగిందని నేర విభాగ శాఖ అధికారులు వెల్లడించారు. 2014లో భారీగా పెరిగిన అత్యాచారాల సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో ఉన్న 53 నగరాలలో ఎక్కువ నేరలు జరిగిన నగరాల వివరాలను కేంద్ర నేర విభాగం విడుదల చేసింది. ఇందులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. 2014వ సంవత్సరం మాత్రం 1813 అత్యాచారాల కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. 
 
ఇంతటి నేరలుపూరిత సంఘటనలు జరుగుతున్న ఈ నగరంలో తామేమి తక్కువ తినలేదనట్టు రాత్రి వేళల్లో మద్యం సేవించి, మత్తులో రోడ్లపై గొవలు పడే అమ్మాయిలు కూడా అక్కడ ఉండనే ఉన్నారు. ఇటీవల కొంత మంది అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని గొడవకు దిగారు.
 
దీన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన పోలీసులు లాఠీ ఝులిపించి వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. గుర్గావ్ సారా మాల్ బయట ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ గుర్గావ్ ఎంజీ రోడ్డులో అత్యధికంగా పబ్బులు, బార్‌లు ఉన్నాయి. అక్కడ నడి రోడ్డుపై మద్యం మత్తులో తూలుతూ ఉన్న ముగ్గురు అమ్మాయిలు గొడవకు దిగారు.

వారు ఆ సమయంలో జుట్లు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. వారి గొడవ ముగిసిన తర్వాత అంతా ఏకమైన ఒకే ఆటోలో ఎక్కి వెళ్లి పోయారు. ఆ మహిళలు జుట్లుజుట్లు పట్టుకుని బాహాబాహికి తెగబడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చెల్ చేస్తుంది.