బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 మే 2024 (17:57 IST)

కీర్తి సురేష్ ఛాలా రిచ్ గురూ అంటున్న అభిమానులు

Keerthy Suresh
Keerthy Suresh
నటి కీర్తి సురేష్ చాలా రిచ్. తను సోషల్ మీడియాలో నెటిజన్లతో మాట్లాడుతూ, తన ఆస్తి విలువ గురించి అడిగితే నవ్వుతూ తేల్చేసింది. అయితే ఆమె ఆస్తి వివరాలు నలభై ఒక్క కోటి రూపాయలట. ఒక్కో సినిమాకు నాలుగు కోట్లు తీసుకుంటుందని సమాచారం. ప్రకటనలు, టెలివిజన్ కార్యక్రమాలు సరేసరే. మహానటి తర్వాత ఆమె తన పాపురాలిటీని బాగా ఉపయోగించుకుంది. ప్రతి ఎండార్స్ మెంట్ కు ముప్పై లక్షలు వసూలు చేస్తుంది.
 
ఇక ఇన్ స్ట్రాలో పెయిడ్ పోస్ట్ కు ఇరవై ఐదు లక్షలు తీసుకుంటుందని టాక్. చెన్నై హైదరాబాద్ లలో మంచి బంగ్లాలున్న ఆమెకు 60 లక్షల వోల్వో కారు, 1 . 38 విలువైన బి.ఎం. డబ్యు 7 సిరీస్ 730 ఎల్.డి., టయోటా, బెంజ్.. ఇలా వున్న ఆమె ఆస్తి వివరాలు తెలుసుకున్న నెటిజన్లు షాక్ కు గురయ్యారు. అందం, నటనతో ఫేమ్ అవ్వడం అంటే ఇదేఅంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.