బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 సెప్టెంబరు 2016 (11:03 IST)

హర్యానా బిర్యానీలో గొడ్డు మాంసం ఉంది.. నిర్ధారించిన ల్యాబ్

హర్యానా రాష్ట్రంలోని బిర్యానీ శాంపిళ్ళలో గొడ్డు మాంసం ఉన్నట్టు బిర్యానీని పరీక్షించిన ల్యాబ్ నిర్ధారించింది. ఈద్ సందర్భంగా పలు హోటళ్లలో బీఫ్ బిర్యానీ తయారుచేస్తున్నట్టు హర్యానా గో సేవా ఆయోగ్ పోలీసులకు

హర్యానా రాష్ట్రంలోని బిర్యానీ శాంపిళ్ళలో గొడ్డు మాంసం ఉన్నట్టు బిర్యానీని పరీక్షించిన ల్యాబ్ నిర్ధారించింది. ఈద్ సందర్భంగా పలు హోటళ్లలో బీఫ్ బిర్యానీ తయారుచేస్తున్నట్టు హర్యానా గో సేవా ఆయోగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం పోలీసులు ముండకాతోపాటు ఇతర గ్రామాల నుంచి బిర్యానీ శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారు. 
 
వాటిని పరిశీలించిన ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెటర్నిటీ ల్యాబ్ ఆ శాంపిళ్లలో గొడ్డు మాంసం ఉన్నట్టు తేల్చిచెప్పింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. కాగా, ఈ బీఫ్ బిర్యానీపై హర్యానా రాష్ట్రంలో తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెల్సిందే.