మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (15:32 IST)

పవన్ అంటే పెను తుఫాను, ఏపీలో ఆయన సామాన్య ప్రజల ప్రతిబింబం: ప్రధాని మోడి (video)

Modi-Pawan
న్యూఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ... ఈయన పేరు పవన్. పవన్ అంటే గాలి అని అర్థం. కానీ ఏపీలో ఈయన పెనుతుఫాను సృష్టించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోట్ల మంది సామాన్య ప్రజల ప్రతిబింబం పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు.
 
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాలలో పోటీ అన్ని స్థానాలనుక గెలుచుకుంది. 100% స్ట్రైక్ రేట్‌ను సాధించింది. అంతేకాదు... ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీలను ఒక కూటమిగా తీసుకురావడంలో కూడా పవర్ స్టార్ కీలక పాత్ర పోషించారు.